తెలంగాణ

telangana

ETV Bharat / state

Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!

liquor-sales
మద్యం దుకాణాలు

By

Published : Nov 6, 2021, 1:40 PM IST

Updated : Nov 6, 2021, 2:21 PM IST

13:34 November 06

అమ్మకాలు ఎక్కువ ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతి

తెలంగాణలోని మందుబాబులకు శుభవార్త. రాష్ట్రంలో మరిన్ని మద్యం దుకాణాలు తీసుకువచ్చే యోచనలో ఎక్సైజ్​శాఖ చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్‌శాఖ అధికారులతో సర్ఫరాజ్ అహ్మద్ వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. 

గత రెండేళ్లల్లో మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా సమావేశంలో చర్చించారు. అమ్మకాలు ఎక్కువ ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతిచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరో 350కిపైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15 శాతం కేటాయింపులు చేస్తున్నట్లు సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. గతంలో ఒక వ్యక్తి ఒక దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండేదని... కొత్త విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని స్పష్టం చేశారు. లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు రుసుము కింద రూ.2 లక్షలు కట్టాలని సూచించింది. 

Last Updated : Nov 6, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details