తెలంగాణ

telangana

రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన.. 20న అల్పపీడనం..!

By

Published : Oct 15, 2022, 4:03 PM IST

TS Weather Report Today: రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.

వర్ష సూచన
వర్ష సూచన

TS Weather Report Today: రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు నైరుతి రుతుపవనాలు బీహార్, సిక్కిం, మేఘాలయ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలంతటా అస్సోం, త్రిపుర, పశ్చిమ బంగాల్​లోని కొన్ని ప్రాంతాలు, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల నుంచి మరింత ఉపసంహరించుకున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం: రాగల 2 రోజుల్లో విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్ మహారాష్ట్ర, ఝార్ఖండ్​లోని మర కొన్ని ప్రాంతాలు, ఇంటీరియర్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు మొత్తం పశ్చిమ బంగాల్‌ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరంల వెంబడి కొనసాగుతూ సగటు సముద్ర మట్టంకి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

అల్పపీడనం: మరోవైపు ఈ నెల 18న ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ ఈ నెల 20న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details