రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అదే విధంగా వడగండ్లు కురిసే అవకాశముందని ప్రకటించారు.
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు - telangana rains
రాగల మూడ్రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ వార్తలు, తెలంగాణ వర్షాలు, తెలంగాణ వానలు, తెలంగాణ వాతావరణ వార్తలు
శుక్రవారం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనివల్ల తూర్పు, ఉత్తర, సెంట్రల్, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.