తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్‌ - schools

TS SCHOOLS: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించింది. ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

TS SCHOOLS
మరో మూడురోజులు విద్యాసంస్థలు బంద్‌?

By

Published : Jul 13, 2022, 2:58 PM IST

Updated : Jul 13, 2022, 3:30 PM IST

TS SCHOOLS: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించింది. ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. వర్షాల వల్ల విద్యాసంస్థలకు ఇప్పటికే మూడు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడురోజులు సెలవులు పొడించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పాఠశాలలకు ప్రకటించిన మూడు రోజుల సెలవులు నేటితో ముగియనున్నాయి. గతవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమ, మంగళ, బుధవారం సెలవులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : Jul 13, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details