'సరైన పోషణతోనే ఆరోగ్య తెలంగాణ' - 'సరైన పోషణతోనే ఆరోగ్య తెలంగాణ'
సరైన పోషణతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన జన చైతన్య ర్యాలీలో టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌తో పాటు పాల్గొన్నారు.
పోషణలోపం ఏ ఊరిలో కనిపించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన జన చైతన్య ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌తో జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని ప్రజలకు... సరైన పోషణ, తాగునీరు, పరిశుభ్రతలపై అవగాహన కల్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే దానం అధికారులకు విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో రైతుపై దళారుల దాడి