తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారికి పోస్కో సీఈవో 10 కోట్ల విరాళం - శ్రీవారిని దర్శించుకున్న చిన్నజీయర్ స్వామి వార్తలు

తిరుమల శ్రీవారిని పోస్కో సంస్థ సీఈవో దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి 10 కోట్ల రూపాయలను విరాళం గా అందించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాలను ప్రభుత్వం రక్షించాలని చిన్నజీయర్ స్వామి విజ్ఞప్తి చేశారు.

శ్రీవారికి పోస్కో సీఈవో 10 కోట్ల విరాళం
శ్రీవారికి పోస్కో సీఈవో 10 కోట్ల విరాళం

By

Published : Feb 26, 2021, 10:46 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. వీటిలో 9 కోట్ల ఎస్వీబీసీ ఛానల్‌ కోసం కాగా.. మిగిలిన కోటి రూపాయల అన్నదానం ట్రస్టు కోసం వెచ్చించాలని కోరారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి దంపతులు.. ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి విరాళాన్ని అందించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఆలయాలను ప్రభుత్వం రక్షించాలి..!

ఆలయాలను ధ్వంసం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని చెదిర్చే ప్రయత్నం చేస్తున్నారని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని చిన్నజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం కల్పించారు. కరోనా నుంచి విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థించానన్న త్రిదండి.. రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఆలయాల మీద జరిగే దాడులకు పరాకాష్ట అన్నారు. ఆలయాలు ధర్మానికి మూల కేంద్రాలని.. ఆలయాల మీద ఆధారపడే ఆన్ని కళలు జీవిస్తున్నాయన్నారు. ఆలయాలను ప్రభుత్వం రక్షించాలన్నారు.

శ్రీవారికి పోస్కో సీఈవో 10 కోట్ల విరాళం

ఇదీ చూడండి:స్కూల్ ఫీజుల నియంత్రణపై మళ్లీ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details