ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో దారుణం జరిగింది. విల్లురి భూలక్ష్మి(50).. పేదలకు నిత్యావసర సరకులు అందిస్తున్నారని తెలుసుకొని వాటిని తీసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లిఫ్ట్ అడిగింది.
ఏపీలోని అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
దాతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆ నిరుపేద మహిళ(50) తెలుసుకుంది. తన కుటుంబానికి ఆకలి తీర్చడం కోసం అక్కడికి వెళ్లాలనుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. సరకులు పంపిణీ చేసే చోటుకు తీసుకెళ్లమంది. సహాయం చేసేందుకు అతనూ ముందుకొచ్చాడు. వాహనం ఎక్కి వెళ్తున్న సమయంలో జారి కింద పడిపోయింది. వెనుకనుంచి వస్తున్న లారీ ఆ మహిళపై నుంచి దూసుకుపోయింది.
ఏపీలోని అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
వాహనంపై వెళ్తున్న సమయంలో వెనక నుంచి కింద పడిపోగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ.. ఆ మహిళపై నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో భూలక్ష్మి తల భాగం పూర్తిగా దెబ్బతిన్న కారణంగా... అక్కడికక్కడే మృతి చెందింది. అనకాపల్లి ట్రాఫిక్ సీఐ బాబ్జి రావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మే 29 వరకు లాక్డౌన్