సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు ఒక్కతాటిపై ఉన్నారని.. ఇది వారి ఐక్యతకు నిదర్శనమని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు సమయమిచ్చిన సీఎం.. కార్మికుల ఐక్యతకు దిగి వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భేషజాలకు పోతే ప్రజలు మరింత నష్టపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి సామరస్యంగా సమస్యకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ జిల్లాలలో కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ డిపోలను సందర్శించి కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని పొన్నం కోరారు.
భేషజాలకు పోతే మరింత నష్టం.. - rtc news
ఇవాళ జిల్లాలలో కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ డిపోలను సందర్శించి కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
పొన్నం ప్రభాకర్...