రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పడుతున్న వర్షాల వల్ల ప్రజలు పడే ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు లేఖ రాశారు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారని, వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి.. ఆహారం అందజేయాలని కోరారు.
వర్షాలతో అవస్థలు పడుతున్న ప్రజలను రక్షించండి: పొన్నం ప్రభాకర్ - సీఎస్ కు లేఖ రాసిన పొన్నం ప్రభాకర్
పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు లేఖ రాశారు. వర్షాల వల్ల ప్రజలు పడే ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా కోరారు.
ప్రజల సమస్యలను పరిష్కరించండి: పొన్నం ప్రభాకర్
ముఖ్యంగా వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్తుకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించేందుకు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాల కారణంగా పంటనష్టం చోటుచేసుకుందని, నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.