రాష్ట్ర నాయకత్వాన్ని ఒక్కతాటిపై తెచ్చి.. తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతామని.. కార్యకర్తలు, ప్రజలలో నమ్మకం సాధిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అద్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఐక్యత లేకపోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులు లేకుండా ప్రజాక్షేత్రంలో పోరాడుతామని అన్నారు.
ప్రశ్నించే గొంతుకు మద్దతివ్వండి : పొన్నం ప్రభాకర్
ఎన్నికల సమయంలోనే కాకుండా... ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయకులే అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఐక్యత లేకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని.. ప్రజల మద్దతుతో ఐక్యంగా ఈసారి తెరాసను ఎదురిస్తామని.. ప్రజల్లో, కార్యకర్తల్లో అవిశ్వాసాన్ని పోగొడుతామని తెలిపారు.
దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందని.. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని అన్నారు. తెరాస అభ్యర్థి గెలిస్తే.. వందమంది సభ్యుల్లో ఒక ఎమ్మెల్యే అవుతారు తప్ప.. ప్రజల కోసం ప్రశ్నించేది ఏమీ ఉండదని తెలిపారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలల్లో సాధించిన అభివృద్ధి చూపించి.. దుబ్బాకలో ఓట్లడగాలని తెరాస నేతలను నిలదీశారు. హరీష్ రావు ఎన్నికల్లో హామీలు ఇచ్చి...ఆ క్షణంలో ప్రజలను ప్రభావితం చేయడం తప్ప ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోరని విమర్శించారు.
ఇవీ చూడండి: బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్