తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటములతోనే కాంగ్రెస్​ పుంజుకుంటుంది: పొన్నం ప్రభాకర్ - హైదరాబాద్ సమాచారం

దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై కార్యకర్తలెవ్వరూ అధైర్యపడవద్దని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెరాస, భాజపా పరస్పర ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించారని విమర్శించారు. కాంగ్రెస్​ ఓడిన ప్రతిసారి బలంగా పుంజుకుంటుందన్నారు.

Ponnam prabhakar comments dubbaka by poll result in congress
ఓటములతోనే కాంగ్రెస్​ పుంజుకుంటుంది: పొన్నం ప్రభాకర్

By

Published : Nov 10, 2020, 7:18 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై కార్యకర్తలెవ్వరూ అధైర్యపడవద్దని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఓడిన ప్రతిసారి బలంగా పుంజుకునే సత్తా ఉందని తెలిపారు.

రాబోయే 2023 ఎన్నికలే లక్ష్యంగా మరింత కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. భాజపా, తెరాస పరస్పర విమర్శలతో ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని వెల్లడించారు.

ఇదీ చూడండి:దుబ్బాకలో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details