తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ సమస్యలపై కేటీఆర్, కేసీఆర్ స్పందించాలి' - పొన్నం ప్రభాకర్

కల్వకుంట్ల ట్విట్టర్‌ రావుగా ప్రచారంలోకి వచ్చిన కేటీఆర్‌ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ నిలదీశారు. వీరి సమస్యలకు పరిష్కారం తెలపకపోతే సీఎం కేసీఆర్.. ప్రజల దృష్టిలో కల్వకుంట్ల కోతలరావుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.

'ఆర్టీసీ సమస్యలపై కేటీఆర్, కేసీఆర్ స్పందించాలి'

By

Published : Oct 9, 2019, 9:14 PM IST

అవసరమున్నా లేకున్నా ప్రతి విషయానికి ట్విటర్​లో వెంటనే స్పందించే కేటీఆర్​.. ఇప్పడు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటెందుకు నిలబెట్టుకోలేదన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే.. ప్రజల దృష్టిలో కేసీఆర్​.. కల్వకుంట్ల కోతలరావుగా మిగిలిపోతారని పొన్నం ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేటీఆర్, కేసీఆర్ వెంటనే స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని... ఆర్టీసీ సమస్య పరిష్కారమయ్యేవరకు నిరంతరం పోరాడతామని పొన్నం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details