హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు కొండూరి ద్రుపథ్ దుర్మరణం పాలయ్యాడు. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడైన ద్రుపథ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైడర్ను ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పొన్నాల లక్షయ్య ఆస్పత్రికి వెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి - సోదరి మనవడు
గచ్చిబౌలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి
వరంగల్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ద్రుపథ్ గచ్చిబౌలిలోని ఖాజాగూడలో నివాసం ఉంటున్నాడు. మాదాపూర్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో వేగం నియంత్రించలేక డివైడర్ను ఢీకొనడం వల్ల మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు
Last Updated : Aug 12, 2019, 10:47 PM IST