తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2020, 4:32 PM IST

ETV Bharat / state

'కేంద్ర బడ్జెట్​ పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఉంది'

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిందని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఏడాదిలో జీడీపీ 10శాతానికి పెంచడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

ponnala laxmaiah respond on central budget 2020
ponnala laxmaiah respond on central budget 2020

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ పీసీసీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారంటే ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి చెబుతున్నారని మండిపడ్డారు. ఆదాయపు పన్ను రాయితీని పెంచుతూనే వ్యక్తిగత రాయితీలను తొలగించి మోసం చేశారని ఆరోపించారు. బడ్జెట్‌ వల్ల దేశ మందగమన పరిస్థితి ఆగదని చెప్పారు. ఈ బడ్జెట్‌ పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details