Ponnala Lakshmaiah Resigns to Congress :కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని పొన్నాల తెలిపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కొందరు నాయకుల వైఖరి వల్ల పార్టీ పరువు మట్టిలో కలిసిపోతోందన్న ఆయన.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదన్నారు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేమని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.
అనంతరం తన రాజీనామాపై మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడ్డానని.. 45 ఏళ్ల పాటు పార్టీలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా.. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించారని.. కానీ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ఏళ్లు ఎలాంటి పదవి ఇవ్వకున్నా తన గళం విప్పానని పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.
Revanth Reddy Fires on CM KCR : 'కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది'
Former PCC president Ponnala Lakshmaiah R esigned to Congress :2014లో కాంగ్రెస్ ఓటమి చెందగానే.. తానే దానికి కారణమని తనను బలి చేశారని పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. అదే 2018లో పార్టీ ఓటమి చెందినా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోలేదని.. తిరిగి వారికి అదనంగా పదవులు ఇచ్చారని అన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు తనను వేదనకు గురి చేశాయని తెలిపారు. హస్తం పార్టీలో తమలాంటి వారిని అవమానిస్తూ.. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు.. పార్టీలో పరాయివాడిగా మారిపోయాడని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.