తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికుల కోసం విరాళం ప్రకటించిన పొన్నాల

వలసకార్మికులను ఆదుకోవాలనే ఏఐసీసీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముందుకు వచ్చారు. తన ఏడాది పెన్షన్‌ను వలస కార్మికుల కోసం అందిస్తున్నట్లు పొన్నాల వెల్లడించారు.

Ponnala announces donation to hanumantha rao for migrant workers
వలస కార్మికుల కోసం విరాళం ప్రకటించిన పొన్నాల

By

Published : May 20, 2020, 4:56 PM IST

ఏఐసీసీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వలస కార్మికుల కోసం రూ.5 లక్షలను విరాళం ప్రకటించారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించడానికి అవసరమైన ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుకు పొన్నాల రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రభుత్వం వద్ద వలస కార్మికుల లెక్కలే లేవని పొన్నాల ఆరోపించారు. రాష్ట్రంలో చిక్కుకున్న అనేక మంది ఆకలితో అల్లాడుతున్నారని పొన్నాల తెలిపారు. వారిని కాంగ్రెస్ పార్టీ తరపున ఆదుకునే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

సూరత్‌లో చిక్కుకున్న తెలుగువారిని కూడా ఇక్కడకు తీసుకువస్తామన్నారు. ప్రియాంక గాంధీ వలసకార్మికుల విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారని వి.హనుమంతరావు అన్నారు. ఆమె తమందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. వలస కార్మికుల కోసం ఒక బిల్లు తీసుకురావాలన్నారు. పొన్నాల మాదిరిగా ఇతర నేతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు.

వలస కార్మికుల కోసం విరాళం ప్రకటించిన పొన్నాల

ఇదీ చూడండి :పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details