తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా... రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు పథకం పేరు చెప్పి హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఆ నిధులు కూడా ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కిసాన్ సమ్మాన్ నిధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
తెరాస ఓటు రాజకీయాలు చేస్తోంది: పొంగులేటి - PONGULETI SUDHAKAR REDDY FIRES ON TRS GOVERNMENT
సబ్కా సాత్... సబ్కా వికాస్... సబ్కా విశ్వాసం నినాదంతో ముందుకెళ్తున్న భాజపావైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని పార్టీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వం ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి ఓట్లేపించుకుని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
![తెరాస ఓటు రాజకీయాలు చేస్తోంది: పొంగులేటి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3802275-thumbnail-3x2-ooo.jpg)
PONGULETI SUDHAKAR REDDY FIRES ON TRS GOVERNMENT