Ponguleti joining in congress :కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు.. తమ పార్టీని బలోపేతం చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Jupally joining in congress :దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని ప్రజలకు భావిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. తనను కాంగ్రెస్‌లోకి రావాలని ఇప్పటికే కొందరు నేతలు ఆహ్వానిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తనకు సోనియా, రాహుల్‌పై గౌరవం ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిగిన ఈటల రాజేందర్ వారిద్దరు బీజేపీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు.
Ponguleti and Jupally to Join Congress : ఆ ఇద్దరిని కమలం గూటికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా పలుమార్లు చర్చించగా.. తనకే వారు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు వారిద్దరిని కాంగ్రెస్‌లో చేరకుండా ఆప గలిగానన్నారు. ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలంగా ఉందన్న ఈటల.. బీజేపీలో చేరేందుకు వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయన్నారు. ఈటల వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత బలం చేసేలా ఉన్నట్లు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉండగా హస్తం నేతలు మాత్రం వాస్తవమే మాట్లాడారని తెలిపారు. అవి తమ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు.