హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్నారు. శిల్పారామంలోని ప్రకృతి అందాలను, పల్లె వాతావరణం ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దిన గ్రామీణ మ్యూజియంలో అందాలను ఆస్వాదిస్తున్నారు.
శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు - telangana news
హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. పల్లె వాతావరణం ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దిన గ్రామీణ మ్యూజియంలో అందాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.
శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
గంగిరెద్దుల విన్యాసాలు, పిట్టలదొర మాటల తూటలు, హరిదాసులు కథలు, బుడ్డ జంగమల ఆటపాటలు, ఎద్దుల బండి సరదాలు, బోటు షికారులతో ప్రజలందరూ ఉల్లాసంగా, ఉత్సహంగా గడుపుతున్నారు. శిల్పారామంలో పల్లె అందాలు... సందర్శనకు వచ్చిన భాగ్యనగర వాసులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:రంగు రంగుల పతంగులు.. ఎగిరేద్దామా!