తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ నిబంధనల మధ్య ముగిసిన పాలిసెట్​ పరీక్ష - పాలిసెట్​ పరీక్ష ముగిసింది

కరోనా జాగ్రత్తల మధ్యే పాలిసెట్​ ప్రవేశ పరీక్ష ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 285 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్​ మధ్యాహ్నం 1.30 గంటలకు పూర్తయ్యింది.

POLYCET entrance exam complete
కొవిడ్​ నిబంధనల మధ్యే ముగిసిన పాలిసెట్​ పరీక్ష

By

Published : Sep 2, 2020, 2:04 PM IST

కొవిడ్ జాగ్రత్తల నడుమ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 918 మంది దరఖాస్తు చేసుకోగా... 285 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడంతోపాటు.. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విద్యార్థులను పరీక్షించి లోపలికి అనుమతించారు. హన్మకొండలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 11 మంది విద్యార్థులను లోపలికి ‌‌కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రంలోకి పంపించాలంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి:మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details