తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్ పాలిసెట్- 2023 నోటిఫికేషన్ విడుదల - తెలంగాణ తాజా వార్తలు

Polycet 2023 notification: పాలిటెక్నిక్ కళాశాల్లలో ప్రవేశాలకు పాలిసెట్- 2023 నోటిఫికేషన్​ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 17న ​పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష జరిగిన పది రోజులకు పాలిసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి

పాలిసెట్
పాలిసెట్

By

Published : Jan 10, 2023, 4:49 PM IST

Polycet 2023 notification:పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్‌-2023ను మే 17వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌తో జ‌న‌వ‌రి 3న‌ జరిగిన సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నారు.

పరీక్ష జరిగిన పది రోజులకు పాలిసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి బాసర ఆర్‌జీయూకేటీ ఈ పరీక్షలో చేరడం లేదు. సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ శ్రీనాథ్‌, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ‌లో పాలిసెట్‌-2023 దరఖాస్తు రుసుం స్వల్పంగా పెంచారు. జనరల్‌, బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రూ.450 ఉండగా దాన్ని రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరిగానే రూ.250 రుసుమే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది దరఖాస్తు చేస్తారని అంచనా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details