తెలంగాణ

telangana

ETV Bharat / state

దీపావళి రోజు ఆ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగింది

హైదరాబాద్​ పరిధిలో ఈసారి దీపావళి పర్వదినం వేళ భారీగా కాలుష్యం పెరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది. బాణాసంచ, టపాసుల మోతతో గత దీపావళితో పోలిస్తే ఈ పండుగ రోజున కాలుష్యం మరింత పెరిగినట్లు నిర్ధరణ అయింది.

Pollution fangs in the telangana on Diwali festival day
దీపావళి రోజు ఆ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగింది

By

Published : Nov 16, 2020, 4:41 AM IST

దీపావళి సందర్భంగా హైదరాబాద్​లో పటాకుల మోత మోగింది. కాలుష్యం కోరలు చాచింది. అంతకు ముందుతో పోలిస్తే దీపావళి రోజున పెరిగినట్లు గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే ధూళి కణాలు దుమ్ము దులిపాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి రోజు రూపొందించే వాయు నాణ్యతా సూచీ కూడా ఇదే విషయాన్ని సృష్టం చేస్తోంది. నగరంలో కంటిన్యూయస్‌ యాంబియెంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టం కేంద్రాలు 24 గంటల పాటు పనిచేశాయి.

నాణ్యతా సూచీ

జూపార్క్‌, హెచ్‌సీయూ, సనత్‌నగర్‌, శివారుల్లోని బొల్లారం, పటాన్‌చెరు, పాశమైలారంలో ఈ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో అతిసూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్‌డయాక్సైడ్‌, ఓజోన్‌, తదితర కాలుష్య కారకాలను లెక్కిస్తున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రతిరోజు సీపీసీబీ వాయు నాణ్యతా సూచీని రూపొందిస్తుంది. జూపార్క్‌, హెచ్‌సీయూ సనత్‌నగర్‌ ప్రాంతాల్లో ఈనెల 13, 14న నమోదైన గణాంకాల్లో వాయు కాలుష్యం పెరిగినట్లు స్పష్టమైంది.

ఘనపు మీటరు‌ గాలిలో మైక్రోగ్రాముల్లో ఉండాల్సిన వార్షిక సగటు

సంస్థ పీఎం 10 పీఎం 2.5
సీపీసీబీ 60 40
ప్రపంచ ఆరోగ్య సంస్థ 20 10

హెచ్‌సీయూ

హెచ్‌సీయూ దగ్గర పీఎం 2.5 ఘనపు మీటర్‌ గాలిలో 21.97 ఎంజీ-43.64 ఎంజీలు, బెంజిన్‌ 1.74 ఎంజీ-3.23 ఎంజీలు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ 29.75 ఎంజీ-38.77 ఎంజీలు, సల్ఫర్‌ డయాక్సైడ్‌ 1.84 ఎంజీ-3.53 ఎంజీలు, ఓజోన్‌ 38.59 ఎంజీ-40.76 ఎంజీలు, పీఎం 10 47.86 ఎంజీ నుంచి 91.49 ఎంజీలకు పెరిగింది.

సనత్‌నగర్

సనత్‌నగర్‌లోని పీఎం 2.5 23.65 ఎంజీ-105.1 ఎంజీలు, బెంజిన్‌ 0.24 ఎంజీ-0.36 ఎంజీలు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ 23.88 ఎంజీ-35.21 ఎంజీలు, సల్ఫర్‌ డయాక్సైడ్‌ 4.58-11.76 ఎంజీలు, ఓజోన్‌ 23.59 ఎంజీ-27.68 ఎంజీలకు పెరిగింది.

జూపార్క్‌

జూపార్క్‌ దగ్గర పీఎం 2.5 ఘనపు మీటర్‌ గాలిలో 35.61 ఎంజీ-55.15 ఎంజీలు, బెంజిన్‌ 0.63 ఎంజీ-0.93 ఎంజీలు, నైట్రోజన్‌డయాక్సైడ్‌ 62.58 ఎంజీ-68.43 ఎంజీలు, సల్ఫర్‌డయాక్సైడ్‌ 3.75 ఎంజీ-4.36 ఎంజీలు, పీఎం 10 88.95 ఎంజీ-123.27లకు పెరిగింది. ఇక్కడ ఓజోన్‌ 13.65 ఎంజీ నుంచి 13.33 ఎంజీలకు స్వల్పంగా తగ్గింది.

ఇదీ చూడండి :కమిషనర్ బౌలింగ్​.. మంత్రి బ్యాటింగ్​

ABOUT THE AUTHOR

...view details