తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో మే నెలలో కాలుష్యం అత్యల్పం! - hyderabad pollution story

భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంటోంది. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసి నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), అతి సూక్ష్మ ధూళి కణాల (పీఎం 2.5) తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌తో పోలిస్తే మేలోనే అత్యల్పంగా నమోదైనట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తాజాగా తేల్చింది.

pollution  decreased in hyderabad
మే నెలలో కాలుష్యం అత్యల్పమే!

By

Published : Jun 18, 2021, 11:24 AM IST

వాహనాలు, రోడ్లు, ఇతరత్రా కారణాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనవి. పీఎం 2.5 కంటికి కనిపించదు. తల వెంట్రుక మందం(50 మైక్రోగ్రాములు)లో 20వ వంతు ఉంటుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. తల వెంట్రుక మందంలో అయిదో వంతు ఉండే పీఎం 10 స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తుంది. ఊపిరి పీల్చుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

అధ్యయనంలో ఏం తేలిందంటే..

హైదరాబాద్​ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్య నమోదు కేంద్రాలను పీసీబీ నిర్వహిస్తోంది. పీఎం 10, పీఎం 2.5 సహా మిగిలిన కాలుష్య ఉద్గారాల తీవ్రతను లెక్కిస్తోంది. మే నెలలో నమోదైన గణాంకాలను సేకరించి అధ్యయనం చేయగా పీఎం 10 తీవ్రత అన్ని ప్రాంతాల్లోనూ గణనీయంగా తగ్గింది. జనవరితో పోల్చితే 2-3 రెట్లు తక్కువగా నమోదైనట్లు గుర్తించారు. పీఎం 2.5 విషయానికొస్తే హెచ్‌సీయూ దగ్గర జనవరిలో 58 ఎంజీలుండగా.. మేలో 19 ఎంజీలకు చేరింది. సనత్‌నగర్‌లో 77 నుంచి 28 ఎంజీలు, జూపార్క్‌ దగ్గర 72 నుంచి 26 ఎంజీలు, జీడిమెట్లలో 41 నుంచి 28 ఎంజీలు, చార్మినార్‌ దగ్గర 37 నుంచి 22 ఎంజీలు, ప్యారడైజ్‌లో 36 నుంచి 27 ఎంజీలకు తగ్గినట్లు తేల్చారు.

ఎందుకిలా..

నగర కాలుష్యంలో వాహనాల వాటా 50 శాతానికిపైగా ఉంటుంది. అధికారుల లెక్కల ప్రకారం రోజుకు 60-70 లక్షలకుపైగా వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. లాక్‌డౌన్‌లో ట్రాఫిక్‌ రద్దీ భారీగా తగ్గడంతోనే పీఎం 10, పీఎం 2.5 తీవ్రత తక్కువగా నమోదైనట్లు పీసీబీ అధికారులు తేల్చారు.

నిర్దేశిత పరిమితులిలా..(క్యూబిక్‌ మీటర్‌ గాలిలో మైక్రోగ్రాముల్లో)


ఇదీ చదవండి :ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details