తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 15న వ్యవసాయ సహకార పరపతి సంఘాల పోలింగ్​ - Cooperative Elections in telangana

సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 905 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు స్థానికంగా రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈనెల ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ... 15న పోలింగ్​... అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

Cooperative Elections
ఈ నెల 15న వ్యవసాయ సహకార పరపతి సంఘాల పోలింగ్​

By

Published : Feb 3, 2020, 9:25 PM IST

Updated : Feb 3, 2020, 11:51 PM IST

ఈ నెల 15న వ్యవసాయ సహకార పరపతి సంఘాల పోలింగ్​

రాష్టంలోని 905 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు స్థానికంగా ఎన్నికల రిటర్నింగ్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల ఆరో తేదీ నుంచి 8 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. తొమ్మిదిన నామపత్రాల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు పదో తేదీతో గడువు ముగుస్తుంది. 15న పోలింగ్ నిర్వహించి... అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. పీఏసీఎస్​లకు ఆఫీసు బేరర్లను 16న ఎన్నుకుంటారు.

ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో సమీక్ష

సహకార ఎన్నికల నేపథ్యంలో 32 జిల్లాల సంయుక్త కలెక్టర్లు, జిల్లా సహకార అధికారులతో వ్యవసాయ, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి... బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన జనార్దన్ రెడ్డి, సహకార శాఖ రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్యతో పాటు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించిన పార్థసారధి... అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, రవాణా సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా శాంతిభద్రతలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా మార్చాలి'

Last Updated : Feb 3, 2020, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details