ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు - గ్రేటర్​లో పోలింగ్​ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్​లో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు బల్దియా పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Polling begins in Greater hyderabad Celebrities was voted
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
author img

By

Published : Dec 1, 2020, 7:46 AM IST

Updated : Dec 1, 2020, 9:06 AM IST

పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజిన్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీసమేతంగా తరలివచ్చి ఓటు వేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఐదు నిమిషాల ముందే తరలి వచ్చారు. వరసలో నిలబడి పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. దీక్షా మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో... సతీమణి కావ్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
  • ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ శాస్త్రీపురంలో ఓటేశారు. ద్విచక్రవాహనంపై పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓవైసీ.... ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • జూబ్లీహిల్స్ క్లబ్​లో మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన చిరంజీవి... ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్​లో సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి.... సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ కోసం తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ 150 డివిజన్లలో 9,101 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంటలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు జీడిమెట్ల, టోలిచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.

ఇదీ చూడండి :ఓటు వేయడానికి వెళ్తున్నారా...? ఈ జాగ్రత్తలు పాటించండి..

Last Updated : Dec 1, 2020, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details