తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచ బ్యాడ్మింటన్​ విజేతకు ప్రముఖుల ప్రశంసలు - పివి సింధుకు ప్రశంసలు

ప్రపంచ బ్యాడ్మింటన్​లో స్వర్ణం కల సాకారం చేసిన తెలుగు తేజం పి.వి.సింధును ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా రాష్ట్ర నేతలు ఆమెను అభినందించారు. సింధు విజయం దేశానికే గర్వకారణమని అన్నారు.

పివిసింధు

By

Published : Aug 25, 2019, 7:25 PM IST

Updated : Aug 26, 2019, 11:53 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో తెలుగు తేజం పి.వి.సింధు విజయం సాధించడంపై ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు ఆమెను అభినందించారు. ట్విట్టర్​ వేదికగా పి.వి.సింధుపై ప్రశంసలు కురిపించారు.

గవర్నర్​ నరసింహన్​, సీఎం కేసీఆర్​, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సింధును అభినందించారు. ఈ విజయం భారతీయులతో పాటు తెలుగు ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు.

ఇదీ చూడండి : ప్రపంచ ఛాంపియన్​షిప్​: సింధు అదరహో

Last Updated : Aug 26, 2019, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details