సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు లక్షల కోట్లు అప్పు చేశారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు... 20వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని.. కానీ ముఖ్యమంత్రి కావాలనే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన... కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేయటాన్ని ఆక్షేపించారు.
'రాష్ట్ర అవతరణ దినోత్సవం మా పాలిట 'బ్లాక్డే'' - shabbir ali slams telangana government
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు 'బ్లాక్డే'గా మారిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన.. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని ఆక్షేపించారు. తెరాస పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని గాంధీభవన్లో మండిపడ్డారు షబ్బీర్ అలీ.

కాంగ్రెస్ పాలిట 'బ్లాక్డే'గా రాష్ట్ర అవతరణ దినోత్సవం : షబ్బీర్ అలీ
జూన్ 2వ తేదీ కాంగ్రెస్ పార్టీకి 'బ్లాక్ డే'గా మారిందని షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకుంటే.. ఇప్పుడు అవేవీ నెరవేరలేదని గాంధీభవన్లో ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని అన్నారు.
ఇదీ చూడండి :'జలదీక్ష' భగ్నం.. అడుగడుగునా అడ్డగింతలు, అరెస్టులు
TAGGED:
shabbir ali on kcr govt