తెలంగాణ

telangana

ETV Bharat / state

Political Parties Reaction on MP Knife Attack : మరో 4 రోజులు ఐసీయూలోనే చికిత్స.. కోడికత్తంటూ అపహాస్యం చేసినవారిపై హరీశ్​రావు కౌంటర్ - MP Kotha Prabhakar Reddy Health Bulletin

Political Parties Reaction on MP Knife Attack : ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అధికార పార్టీ నాయకుడిపై దాడి జరిగితే కోడి కత్తి అంటూ ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తున్నాయని.. బీఆర్ఎస్​కు అలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని.. రఘునందన్​రావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్‌ విమర్శించింది.

Minister Harishrao fires on Opposition Leaders
MP Kotha Prabhakar Reddy Health Bulletin

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 7:27 PM IST

Political Parties Reaction on MP Knife Attack మరో 4 రోజులు ఐసీయూలోనే చికిత్స.. కోడికత్తంటూ అపహాస్యం చేసినవారిపై హరీశ్​రావు కౌంటర్

MP Kotha Prabhakar Reddy Health Bulletin :అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డికి(MP Kotha Prabhakar reddy) యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం కోలుకోవడం కష్టమని వైద్యులు తెలిపారు. అత్యవసర విభాగం ఐసీయూలో 4 రోజుల పాటు చికిత్స అందించాలని.. అప్పుడే ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగవుతుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు కూడా ఉన్నట్లు.. పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

"ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం కోలుకోవడం కష్టం. అత్యవసర విభాగం ఐసీయూలో 4 రోజుల పాటు చికిత్స అందించాలి. అప్పుడే ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు కూడా ఉన్నాయి. పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాము". - విజయ్ కుమార్‌, యశోద వైద్యుడు

Murder Attempt on MP Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స, ఐసీయూకు తరలింపు

Minister Harishrao fires on Opposition Leaders :పార్లమెంటు సభ్యుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడితే.. ప్రతిపక్ష నేతలు కోడి కత్తి అంటూ అపహాస్యం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మరోసారి పరామర్శించారు. హత్యాయత్నాన్ని ఖండించాల్సిన సీనియర్‌ నేతలు సైతం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

"పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్​రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడితే.. కోడికత్తి అంటూ ప్రతిపక్ష నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఈ దుశ్చర్యను ఖండించాల్సిన సీనియర్ నేతలు సైతం చిల్లర మాటలు మాట్లాడుతున్నారు".- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

Raghunandan rao Reacts on MP Knife Attack :ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడితో బీజేపీకు సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తమ పార్టీ నేతలపై దాడుల సమయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే బందోబస్తు ఎలా ఇస్తారని పోలీస్ శాఖను ప్రశ్నించారు.

Congress Reacts on MP Knife Attack :దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికే సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి ఏంటని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి ఘటనకు నిరసనగా... బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ బంద్ కొనసాగింది.

MP Kotha Prabhakar Reddy Health Bulletin : కొత్త ప్రభాకర్​రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్న వైద్యులు

MLA Raghunandan Rao on MP Prabhakar Reddy Attack : 'నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది.. ఆ దాడికి నాకు సంబంధం లేదు'

ABOUT THE AUTHOR

...view details