Political Parties Election Campaign in Telangana :రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాల పర్వం ఊపందుకుంది. ప్రధాన నేతలు బహిరంగసభ(Telangana Election Campaign)లతో ముందుకెళుతుంటే.. టిక్కెట్ వచ్చిన నాయకులు నియోజకవర్గాల్లో ప్రచారాలను ముమ్మరం చేశారు. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా.. మేడ్చల్‌లోని మసీదుల్లో ప్రార్థనల అనంతరం ప్రచారం చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల తర్వాత డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో.. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్(BRS Door to Door Election Campaign)కు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం రెండో రోజూ సెంచరీ దాటేశాయిగా
Telangana Assembly Elections 2023 :ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేందర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల చెంతకు వెళుతున్నారు. జగిత్యాలలో సంజయ్‌కుమార్.. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరికిశోర్ కుమార్ ప్రచారం నిర్వహించారు.
Congress Election Campaign : హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. రాంనగర్ చేపల మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన.. స్థానిక వ్యాపారస్తులను కలిసి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రచారంలో భాగంగా హస్తినాపురం డివిజన్‌లోని పర్యటించారు. విరాట్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.