Political Parties Election Campaign in Telangana : రాష్ట్రంలో ఏదైనా నిర్ధిష్ట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు నామినేట్ చేసే ప్రముఖ వ్యక్తులను స్టార్ క్యాంపెయినర్లు అంటారు. సినిమా నటులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రధాని, మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పార్టీల అధ్యక్షులు, అగ్రనేతలు.. తదితర వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది.
National Parties Maximum Star Campaigners : స్టార్ క్యాంపెయినర్లుగా జాతీయ పార్టీలు 40, రాష్ట్ర పార్టీలు 20 మందిని వినియోగించుకోవచ్చు. ఎవరైతే ప్రచారం చేస్తారో వారి జాబితాను నోటిఫికేషన్ తేదీ నుంచి వారం రోజులలోపు ఎన్నికల సంఘానికి చెప్పాలి. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసే వ్యక్తి తన వాహనంపై ఎన్నికల సంఘం చేసే పర్మిట్‌ను అతికించాలి. వారు ఆ పార్టీ తరుఫున ప్రచారం చేస్తే ఆ ఖర్చును పార్టీ ఖాతాలో వేస్తారు. ప్రయాణం ఖర్చును పరిగణలోకి తీసుకోదు.
'స్టార్ క్యాంపెయినర్ ఎవరో ఈసీ ఎలా నిర్ణయిస్తుంది?'
- స్టార్ క్యాంపెయినర్ నిర్వహించే సభ, ర్యాలీ, పోస్టర్లుతో అభ్యర్థి ఫొటోలున్నా, సమావేశాల్లో అభ్యర్థి పేరును ప్రస్తావించినా వాటి ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సభలో పాల్గొన్నప్పుడు, వారి ఫొటోలతో కూడిన పోస్టర్లు ఉంటే, అటువంటి ర్యాలీ/సమావేశానికి అయ్యే ఖర్చులను అభ్యర్థులందరి ఖాతాలో సమానంగా విభజించి వేస్తారు.
- ఒకవేళ స్టార్ క్యాంపెయినర్(Star Campainers in Telangana) ప్రధాని, మాజీ ప్రధాని అయితే కేంద్రం నియమించిన భద్రతా సిబ్బందికి అవసరమైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వీరితో పాటు మరో రాజకీయ ప్రముఖుడు వస్తే భద్రాతా ఏర్పాట్ల కోసం అయ్యే వ్యయంలో సగం అభ్యర్థే భరించాల్సి ఉంటుంది.
Star Campaigners Expendature : ఎన్నికల సంఘం విధించిన నిబంధనలను స్టార్ క్యాంపెయినర్లు ఉల్లంఘించినా, విద్యేషపూరిత ప్రకటనలు చేసినా.. వారు పాల్గొన్న సమావేశాలు, ర్యాలీలు మొత్తం ఖర్చును అభ్యర్థుల ఖాతాలోనే వేస్తారు. నిర్థిష్ట నియోజకవర్గంలో క్యాంపెయినర్లు ప్రచారానికి పరిమితమయ్యారా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోదు.