తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు నేతల అభినందనలు - ఎమ్మెల్సీ కవిత తాజా వార్తలు

నిజామాబాద్​ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిచిన కవితకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కవిత పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ విజయం నిదర్శనమని నేతలు అభినందనలతో ముంచెత్తారు. శాసన వ్యవహారాలతో పాటు.. పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆమెను కోరారు.

ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు నేతల శుభాకాంక్షలు
ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు నేతల శుభాకాంక్షలు

By

Published : Oct 13, 2020, 7:07 PM IST

Updated : Oct 13, 2020, 7:25 PM IST

ఎమ్మెల్సీ కవితకు మంత్రులు శ్రీనివాస్​ గౌడ్​, పువ్వాడ అజయ్​ కుమార్​ శుభాకాంక్షలు

నిజామాబాద్​ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికలో గెలిచిన కల్వకుంట్ల కవితను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాల్లో కవిత పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ విజయం నిదర్శనమని నేతలు అభినందనలతో ముంచెత్తారు. శాసన వ్యవహారాలతో పాటు.. పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆమెను నేతలు కోరారు.

కవితకు మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి

మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్​, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్​లు గొంగిడి సునీత, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కె.విద్యా సాగర్ రావు, వనమా వెంకటేశ్వరరావు, అబ్రహం, కృష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పీఆర్​టీయూ నేత పూల రవీందర్, టీబీజీకేఏ నేత రాజిరెడ్డి తదితరులు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కవితకు ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

ఇదీ చదవండి:నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

Last Updated : Oct 13, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details