తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలొచ్చినప్పుడే చేతినిండా పని - తర్వాత పట్టించుకునే వారే ఉండరు - తెలంగాణ రాజకీయాలు

Political Leaders Using Artists Election Campaigning : ఎన్నికలు వచ్చాయంటే చాలు కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. చేతి నిండ పని ఉంటుంది. ఆటాపాటల అనురాగాల పూదోట తెలంగాణ. నాటి సాయుధ పోరాటం నుంచి.. తెలంగాణ ఉద్యమం వరకు సామాజిక చైతన్యంలో పాటది ప్రత్యేక స్థానం. ఈ పాటలనే.. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. అభ్యర్థులకు పాటల రూపంలో ప్రచారం చేస్తూ గెలుపునకు కృషి చేస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కళాకారులు.

Telangana Assembly Elections 2023
Political Leaders Using Artists Election Campaigning

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 10:02 AM IST

ఎన్నికలొచ్చినప్పుడే చేతినిండా పని - తర్వాత పట్టించుకునే వారే ఉండరు

Political Leaders Using Artists Election Campaigning : ఆటాపాటల అనురాగాల పూదోట తెలంగాణ. నాటి సాయుధ పోరాటం నుంచి.. తెలంగాణ ఉద్యమం వరకు సామాజిక చైతన్యంలో పాటది ప్రత్యేక స్థానం. కష్టాలొచ్చినా, కన్నీళ్లొచ్చినా, సంబరాలు అంబరాన్నంటినా.. జనాన్ని ప్రభావితం చేసేది పాటే. ఈ పాటలనే.. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. బీఆర్ఎస్ రూపొందించిన గులాబీల జెండాలే రామక్క పాట.. ఊరువాడలో ఊర్రూతలూగించడంతో మిగతా పార్టీలూ అదే బాటలో నడుస్తున్నాయి. అయితే కళాకారులు మాత్రం తమకు ఎన్నికలప్పుడే ఉపాధి లభిస్తుందని.. తర్వాత తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుది ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం - పార్టీ గుర్తును చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు

Telangana Election Campaign Artists : తెలుగు సాహిత్యంలో ఎన్నో దశలున్నప్పటికీ పాట ప్రజలను త్వరగా ఆకట్టుకుంటుంది. సమాజంలో అనేక సమస్యల పరిష్కారానికి తోడై అండగా నిలుస్తుంది. ఉవ్వెత్తున ఎగిసిన ప్రతీ ఉద్యమం వెనుక పాట దాగి ఉంది. ప్రపంచ గతిని మార్చిన ప్రతీ మార్పులో పాట ప్రాతినిధ్యం వహించింది. శ్రమజీవుల బాధలను వర్ణిస్తూ సెమట సుక్కల పాటలు జనాల మదిలో నిలిచాయి. పల్లె జానపదాల నుంచి పుట్టుకొచ్చిన పాటలు తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించాయి. పాటకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన పార్టీలు ఇదే అస్త్రాన్ని వాడుకొని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నాయి.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాల్లోభాగంగా బహిరంగ సభలు ర్యాలీల్లో కళాకారుల ఆటపాటలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారాన్ని కళాకారులు కొత్త హంగులో నడిపిస్తూ, కార్యకర్తలను ఉర్రూతలూగిస్తున్నారు. సభలకు ముఖ్య నాయకులు వచ్చేలోపు ప్రజలకు విసుగు రాకుండా తమ పాటలతో కట్టిపడేస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోలు, ప్రజా సంక్షేమ పథకాలను పాట ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం కోసం కళాకారుల తలుపు తట్టడంతో వారికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఎన్నికలు వచ్చినప్పుడే తమకు పని దొరుకుతుందనీ.. తర్వాత పట్టించుకునే వారే ఉండరని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'యూపీలో మాఫియాలను బుల్డోజర్​తో తొక్కిపడేశాం - ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే అదే జరుగుతుంది'

Telangana Assembly Election Campaign :ఆయా పార్టీల అభ్యర్థుల పర్యటనలో భాగంగా, గ్రామాలకు ముందుగానే చేరుకొని హామీలు పార్టీల విధి విధానాలు పాటల రూపంలో జనాలకి వివరిస్తున్నారు. వారి కళా నైపుణ్యంతో ప్రజల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తి స్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్ షోలలో కళాకారుల నృత్యాలు, డోలు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. అభ్యర్థుల బలాబలాలు ఎంతున్నప్పటికీ కళాకారుల ఆటపాటలు అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎన్నికలప్పుడే కాకుండా, మిగతా సమయాల్లోనూ ప్రభుత్వం తమకు జీవనోపాధి కల్పించాలని కళాకారులు కోరుతున్నారు.

ఎన్నికలొచ్చినప్పుడే చేతినిండా పనిదొరికి.. తమ జీవన పరిస్థితులు మెరుగ్గా ఉంటున్నాయని.. ఆ తర్వాత దారుణ పరిస్థితులను ఎదుర్కుంటున్నామని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీవనోపాధి కల్పించాలని.. నెలవారి జీవనభృతి ఇవ్వాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కుటుంబపాలనతో ఇంకా ఎన్నిరోజులు బాధ పడతారు - బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి : యోగి ఆదిత్యనాథ్

పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించిన బీఆర్​ఎస్ ​- హైదరాబాద్‌లోని వార్‌రూం నుంచి పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details