తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2019, 11:54 PM IST

ETV Bharat / state

నిధులివ్వండి

రాష్ట్ర పర్యటనలో ఉన్న 15వ ఆర్థిక సంఘానికి వినతులు వెల్లువెత్తాయి. ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతం కోసం నిధుల కేటాయింపు పెంచాలని కోరారు.

ఆర్థికసంఘం బృదంతో నేతల భేటి

15వ ఆర్థిక సంఘ సభ్యులతో నేతల భేటి
ఎన్కే సింగ్ ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం సభ్యులతో హైదరాబాద్​లో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సరిపడ నిధులు విడుదల చేయాలని తెరాస నేతలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులను వివరించారు.

14వ ఆర్థికసంఘం నుంచి మొండిచేయి.!

14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు లేక అభివృద్ధి తగ్గిందని....జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పనులు చేయాలన్న ఇబ్బందిగా ఉందని చెప్పినట్లు కొందరు నేతలు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల్లో నూతన భవనాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సార్‌డీపీ ప్రాజెక్టు ద్వారా కొత్త ప్లైఓవర్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.

అప్పులు కూడా ఆదాయమేనా...?

రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ విషయంలో గారడీ చేస్తోందని.. ఇదే విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అప్పులను కూడా ఆదాయం చూపిస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు వ్యయం ఎక్కువయినందున మరిన్నీ నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరినట్లు భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు తెలిపారు. కాగ్ నివేదికపై కూడా దృష్టిపెట్టాలని సూచించినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు కేటాయింపులు పెంచాలని నేతలు ప్రధానంగా ఆర్థిక సంఘం సభ్యులను కోరినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details