Political Leaders Free Gifts Distribution : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు త్వరలోనే ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రేపో మాపో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన పలువురు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలెట్టేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ఇంకాస్త సమయం ఉండటంతో ఆశావహులు, నేతలు ముందుగానే తాయిలాలు పంపిణీని ప్రారంభించారు. షెడ్యూల్ తర్వాత కోడ్ అమల్లోకి వచ్చాక.. ఏదైనా పంపిణీ చేయాలంటే అధికారులు, పోలీసుల నిఘా ఉంటుంది. ప్రత్యర్థి నేతలూ అల్లరల్లరి చేసేస్తారు. ఎలక్షన్ కమిషన్ కొరడా ఝుళిపిస్తుంది.
Ujjwala Yojana Free Gas Cylinder : కేంద్రం శుభవార్త.. ఉచితంగా మరో 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు
Telangana Assembly Elections 2023 :ఈ అన్ని బాధలు లేకుండా ఎలక్షన్ కోడ్ రాకముందే పలు జిల్లాల్లో కొంతమంది నాయకులు ఉచితాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చీరలు, కుట్టు మిషన్లు, గడియారాలు, కుక్కర్లు దర్జాగా పంపిణీ చేస్తూ.. ఈ ఎన్నికల్లో తమకే ఓటు వేసి గెలిపించాలని మాట తీసుకుంటున్నారు. స్థానికంగా ఎంతోకొంత ప్రభావం చూపేవారికి మరింత వ్యక్తిగత లబ్ధి చేకూర్చేందుకూ వెనకాడటం లేదు. ఇంకొన్ని చోట్ల ఆయా పార్టీలు చేపట్టే సర్వేల్లో.. తమకు సానుకూలమైన నివేదిక వచ్చేలా కొందరు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, పెద్ద పెద్ద గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. తమ గ్రాఫ్ పెంచుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు.