Political Heat in Telangana :రాష్ట్రంలో రాజకీయం ఎన్నికల ప్రచారాన్నితలపిస్తోంది. అసెంబ్లీ పోరుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టున్న బీఆర్ఎస్ సభలు, సమావేశాలతో జనంలోకి వెళ్తోంది. అటు తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్, బీజేపీలు అగ్రనేతలను బరిలోకి దింపాయి.
Modi Statements on BRS and Congress :బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలనాథులు దూకుడు పెంచారు. మహాజన్ సంపర్క్ సహా వివిధ కార్యక్రమాల ద్వారా కేంద్రమంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేలా అగ్రనేతలు రంగంలో దిగారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నవసంకల్ప సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఎన్డీఏ సర్కార్ అభివృద్ధిని వివరిస్తూనే కేసీఆర్ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇక నిన్న ఓరుగల్లులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్రమోదీ.... విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని వీటిని ఓడించి బీజేపీకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దూకుడు పెంచిన కాంగ్రెస్.. అధికారమే లక్ష్యంగా.. : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని భావిస్తున్న కాంగ్రెస్... ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో శ్రమిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అగ్రనాయకత్వం పాదయాత్రలు, సభలతో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపైనా పోరుబాటపట్టింది. ఇదేసమయంలో జాతీయ అగ్రనేతలు తెలంగాణ బాటపట్టారు. ఇప్పటికే ఓరుగల్లులో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్... సరూర్‌నగర్ సభావేదికగా ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇదేసమయంలో కర్ణాటక గెలుపు ఇచ్చిన ఊపుతో తెలంగాణలోనూ దూకుడు పెంచింది. ఖమ్మం జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ బీఆర్ఎస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందన్న అంచనాల నడుమ బీఆర్ఎస్... బీఆర్ఎస్కుబీ టీమ్ అంటూ ఆరోపణలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ఓడించినట్లుగానే ఇక్కడ ఆ పార్టీ టీమ్‌ను ఓడిస్తామని ప్రకటించారు