ఏ,బీ-టీమ్‌ల పంచాయితీ.. ఇంతకి ఎవరుఎవరితో కుమ్మక్కయ్యారో Political Heat in Telangana :రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మహారాష్ట్రలోని సర్కోలిలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్... రైతుల పక్షాల పోరాడే పార్టీ బీఆర్ఎస్ఏ అని నినదించారు. తాము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీకామ్ కాదని... రైతులంతా ఒక్కటై బీఆర్ఎస్ వెంట ఉంటున్నారనే.. కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నారని.. కేసీఆర్ తెలిపారు.
Telangana Assembly Elections 2023 :కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి అన్ని విషయాల్లో.. బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తోందని.. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'అసలు అసత్యంగా, అసభ్యంగా, అవినీతికరంగా, అసమర్థత పారిపాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. మొన్నటి వరకు మోదీకి రిప్రెజెంటేషన్ ఇస్తే గోడకి ఇచ్చినట్టే అన్నారు. నాగ్‌పూర్ సభలకు వెళ్లి మోదీ నా మిత్రుడని చెప్పారు. నిన్న మీరు ఒక మీటింగ్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు బీజేపీతో రాజీ ఉండదని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్‌కర్నూల్ వచ్చి రాజీ ఉండదు అంటారు. వీళ్లీద్దరు రాజీతోని రాజకీయం కుట్రతో దిల్లీలో కలుస్తారు. వీరిద్దరు మాట్లాడే భాషను గమనిస్తే ఒకే తీరుగా మాట్లాడతారు. చంద్రశేఖర్ రావు బీజేపీ పార్టీ.' - మధుయాస్కీ, కాంగ్రెస్ సీనియర్ నేత
Telangana Politics Updates : రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్లే.. కాంగ్రెస్‌కు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురయ్యాయంటూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పేర్కొన్నారు. అంతటి ఆగకుండా... బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారనుకున్న 30 సీట్లలో.. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆరే.. ఆర్థిక సాయం చేస్తున్నారంటూ.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేయడం.. రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.
'ఇప్పుడు మాకు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరితే ఉపఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గెలిచే పార్టీ ఏది..? వారికి అభ్యర్థులు ఎందుకు కరువైతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు ఎందుకు గెలుస్తుంది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ వ్యతిరేకం అయితే 2 సీట్లే ఎందుకు గెలిచింది. కాంగ్రెస్ అనుకుంటే సరిపోదు కదా ప్రజలు అనుకోవాలి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు అని. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డి.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అటు మహారాష్ట్రలోనూ.. కేసీఆర్ పర్యటనలపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్..స్పందించారు. మహారాష్ట్రలో రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభావం... ఏమాత్రం ఉండబోదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్..బీజేపీ B-టీమ్ అని ఆరోపణలు గుప్పించారు. పదునెక్కిన నేతల విమర్శలతో.. ఏ పార్టీతో ఏ పార్టీ ములాఖత్ అయ్యిందో తెలియక.. రాష్ట్ర ప్రజలు, ఆయా పార్టీల కిందిస్థాయి నేతలు అయోమయానికి గురవుతున్నారు.
ఇవీ చదవండి: