భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సవాలు విసిరారు. ఎన్డీఏస్వతహగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తావా అని ప్రశ్నించారు. 16 సీట్లు గెలిస్తే దిల్లీలో చక్రం తిప్పుతా అంటున్న కేటీఆర్...16 సీట్లతో కేంద్ర ప్రభుత్వంను ఏర్పాటు చేస్తారా అని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోందని అంటున్నప్పటికీ ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే కేంద్ర ప్రభుత్వంను ఏర్పాటు చేస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలపాలన్నారు. 'నరేంద్రమోదీ మా ఐకాన్... మోదీ కోసం దేశం- దేశం కోసం మోదీ మా నినాదం' అన్నారు. ఎన్డీఏనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.