తెలంగాణ

telangana

ETV Bharat / state

రాకేష్ లావాదేవీలపై ఆరా - rakesh reddy

రాకేష్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టిసారించారు. అతనితో సంబంధం ఉన్న స్థిరాస్తి వ్యాపారుల జాబితాను సేకరించి విచారిస్తున్నారు.

రాకేష్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా

By

Published : Feb 22, 2019, 6:18 AM IST

Updated : Feb 22, 2019, 9:33 AM IST

చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి భూదందాలపై పోలీసులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ చింతల్​ స్థిరాస్తి వ్యాపారుల జాబితాను సేకరించారు. రియల్టర్లు రాజేష్, శ్రీధర్​లను గురువారం బంజారాహిల్స్ ఠాణాకు పిలిపించి విచారించారు. వివాదాల్లో ఉన్న స్థలాలకు సంబంధించి తమకు ఒక ఎస్సై సలహాలు, సూచనలను ఇస్తుండేవాడని వారు వివరించారు. ఓ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుల అధీనంలోని స్థల వివాదంలోనూ రాకేష్ తలదూర్చి.. వారికి అనుకూలంగా పోలీసు అధికారులతో కలిసి లాభం చేకూర్చినట్టు దర్యాప్తులో అధికారులు వివరాలు సేకరించారు.
శ్రీలంకలో విందూవినోదం...క్యాసినోల్లో జూదం
గత నెల 25న శ్రీలంకకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. కొలంబోలోని ఓ హోటల్ గది అద్దెకు తీసుకుని 25, 26, 27 తేదీల్లో విందు, వినోదాలు, క్యాసినోలో జూదం ఆడుతూ గడిపినట్టు దర్యాప్తులో గుర్తించారు. మిత్రులతో కలిసి మూడు రోజుల్లో 20 లక్షల రూపాయల మేర ఖర్చు చేసినట్టు బయటపడింది.
శిఖాచౌదరి స్నేహితుడి విచారణ
జయరాం మేనకోడలు శిఖాచౌదరి స్నేహితుడు సంతోష్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరి మధ్య స్నేహంపై ఆరా తీశారు. గత నెల 31వ తేదీన కారులో బాహ్య వలయ రహదారిపైకి వెళ్లినట్టు...సంతోష్‌ పోలీసులకు తెలిపాడు.

రాకేష్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా
Last Updated : Feb 22, 2019, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details