తెలంగాణ

telangana

ETV Bharat / state

గోడకు తల బాదుకొని పోలీసులపై నెట్టేశాడు

ఏ తప్పు చేయకపోయినా తనపై కావాలనే దాడి చేశారని సాయితేజ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు వెల్లడించారు. తప్పు సాయితేజదే అంటూ దానికి సంబంధించిన సీసీటీవి ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.

గోడకు తల బాదుకొని పోలీసులపై నెట్టేశాడు

By

Published : Jun 5, 2019, 3:18 PM IST

Updated : Jun 5, 2019, 11:17 PM IST

తుకారాం గేట్ పోలీసులు ఓ యువకుడిపై దాడి చేశారని వస్తున్న వార్తలపై వారు స్పందించారు. తప్పు చేసింది యువకుడు సాయితేజనే అని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను చూపించారు. నిన్న అర్ధరాత్రి తుకారాం గేట్ చౌరస్తాలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని... ఆ సమయంలో తెరాసకు చెందిన సాయితేజ ద్విచక్రవాహనంపై వెళ్తూ... గొడవ చూసి ఆగాడన్నారు. గొడవను ఆపేందుకు వెళ్లి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని తెలిపారు. మా మధ్యలో నీవెందుకు తలదూర్చావంటూ ఇరువర్గాలు సాయితేజను కొట్టారని పేర్కొన్నారు. కోపోద్రిక్తుడైన సాయితేజ రెండు వర్గాలకు చెందిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడని చెప్పారు. మహిళ అని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడని వివరించారు. ఇదంతా సీసీటీవి ఫుటేజీలో నమోదైనట్లు వీడియోలు బయట పెట్టారు.

తనకు తానే కొట్టుకున్నాడు

గొడవ సమాచారం అందుకున్న పోలీసులు సాయితేజని అదుపులోకి తీసుకున్నారు. సాయితేజని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చి గొడవ ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఈ కేసు తన మీదకు వస్తుందనే భయంతో సాయితేజనే... పీఎస్​లోని గోడకు కొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన బాబాయికి ఫోన్ చేసి రప్పించుకొని పోలీసులు కొట్టారని చెప్పాడు. ముక్కు, మొహంపై రక్తం ఉన్నందున వారు నిజమని నమ్మి తమపై తిరగబడ్డారని ఎస్సై రాంలాల్ వివరించారు. అనంతరం సాయితేజని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. సాయిని తామేమీ కొట్టలేదని... అతనే గోడకు కొట్టుకున్నట్టు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని రాంలాల్ చెప్పారు.

సాయితేజపై కేసు నమోదు చేస్తాం

ఈ విషయానికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఉత్తర మండల​ డీసీపీ కలమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తుకారాం గేట్ పోలీసులు తెలిపారు. సాయితేజపై, అతనికి మద్దతిస్తూ... కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన వారందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

గోడకు తల బాదుకొని పోలీసులపై నెట్టేశాడు

ఇవీ చూడండి: హైదరాబాద్​ అమ్మాయిలు ఎందుకు గడప దాటుతున్నారు?

Last Updated : Jun 5, 2019, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details