పాము కనిపిస్తే ఏమిచేస్తాం... కెవ్వుమని కేకపెట్టి పరుగందుకుంటాం లేదా చేతికందిన కర్రతో దానిని చంపేస్తాం. అది ఏమి చేస్తుందనే భయంతో మనం.. దానిని ఏమి చేస్తామనో ఆ పాము మధ్య నెలకొనే గందరగోళంలో ఏదొకటి చేసేస్తాం. కాని ఆ పోలీసు అధికారి అలా అనుకోలేదు. అది ఎలాంటి విషసర్పమైనా దానికి హాని తలపెట్టక పోతే అది ఏమి చెయ్యదని నిరూపించాడు. దాహంతో ఉన్న పాముని చేతుల్లోకి తీసుకుని దానిని అటూ ఇటూ తిప్పుతూ ఆడించాడు. దప్పికతో ఉన్న పాముకి నీరు పట్టించి మానవత్వాన్ని చాటుకున్నాడు. గోల్కొండకోట వద్ద కనిపించిన ఈ దృశ్యం కొందరికి పోలీసులోని ధైర్యసాహసాలు కనబడితే ఇంకొందరికి అతనిలోని మానవత్వం కనిపించింది.
పాము దాహం తీర్చిన పోలీస్
వీలైతే ప్రేమించండి డ్యూడ్ మహా అయితే ఏంచేస్తారు తిరిగి ప్రేమిస్తారు అని ఓ సినీ రచయిత చెప్పినట్లుగా విషసర్పాలకు హాని తలపెట్టకపోతే అవి కూడా మనతో కలిసి పోతాయన్నదానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ పాము పిల్లను చేతిలోకి తీసుకుని దానికి నీళ్లుపట్టించాడు పోలీస్ అధికారి శ్రీనివాస్.
పాము దాహం తీర్చిన పోలీస్