తెలంగాణ

telangana

ETV Bharat / state

Police Vehicles: జోన్లవారీగా ప్రతివారం వాహనాలకు శానిటైజేషన్‌ - వానాలకు శానిటైజేషన్

కరోనా కల్లోలం మొదలైనప్పటినుంచీ పోలీసులు ముందుండి సేవలందిస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు....వారు నిరంతరం ప్రమాదమని తెలిసినా బయటే తిరుగుతున్నారు. అలాంటి పోలీసులకు ఉడతసాయంగా తమవంతు సేవ చేసేందుకు వీఆర్‌ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో పోలీసుల వాహనాల శానిటైజేషన్‌ బాధ్యతను తీసుకుంది.

జోన్లవారీగా ప్రతివారం వాహనాలకు శానిటైజేషన్‌
జోన్లవారీగా ప్రతివారం వాహనాలకు శానిటైజేషన్‌

By

Published : Jun 3, 2021, 10:14 AM IST

వైరస్‌ కట్టడికి పోలీసులు కీలకంగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌(Lockdown) అమలుకు నిరంతరం శ్రమిస్తున్నారు. అటువంటి పోలీసులకు తమవంతు సాయం చేయాలని వీఆర్‌ సంస్థ భావించింది. పోలీసులు నిత్యం తిరిగే పెట్రోలింగ్‌ వాహనాల శానిటైజేషన్‌ బాధ్యతలు తీసుకుంది. హైదరాబాద్‌ మహానగరంలోని 63 పోలీస్‌ స్టేషన్‌లు, 26 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లలో 564 పెట్రోలింగ్‌ వాహనాలు(Patrolling vehicles) ఉన్నాయి. ప్రతి వారం శిక్షణ పొందిన సంస్థ సిబ్బంది... కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలను శానిటైజ్‌ చేస్తారు. ముందు వరుసలో ఉంటున్న పోలీసులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే... కార్యక్రమానికి ఉపక్రమించామని వీఆర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సమాజంలో ఏ సంక్షోభం తలెత్తినా పోలీసులు ముందుండి పోరాడతారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. పోలీసు సైరన్‌ వింటే జనంలో భరోసా వస్తుందన్నారు. గస్తీ వాహనాల శానిటైజేషన్‌కు ముందుకొచ్చిన వీఆర్‌ సంస్థను... సీపీ అభినందించారు. పోలీసు సిబ్బంది అందరూ విధిగా మాస్కులు ధరించాలని... ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Vaccine : వ్యాక్సిన్​తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్

ABOUT THE AUTHOR

...view details