కరోనా రెండో దశ విజృంభన నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. చిక్కడపల్లి డివిజన్లోని గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారుల వద్ద పోలీసులు చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అనవసరంగా బయటికి వచ్చే వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ముషీరాబాద్లో వాహన తనిఖీలు ముమ్మరం - ముషీరాబాద్లో లాక్డౌన్ను పటిష్టంగా అమలుచేస్తున్న పోలీసులు
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఉదయం 10 దాటాక రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ముషీరాబాద్లో వాహన తనిఖీలు ముమ్మరం
ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా వెళ్తున్న ఓ ఎస్బీఐ ఉద్యోగి తన కారుపై పోలీస్ స్టిక్కర్ను ఏర్పాటు చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన పోలీసులు ఉద్యోగిని అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి డివిజన్లో ఇప్పటి వరకు వందలాది వాహనాలు సీజ్ చేసినట్లు ఏసీపీ శ్రీధర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'