లాక్‌డౌన్ సమయంలో రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు ఎంత చెప్పినా ప్రజల తీరు మార్చుకోక పోవటం వల్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వాహనాదారులకు కరోనా వైరస్ అవగాహన ఫ్లకార్డులు ఇచ్చి ఎండలో నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు సాంకేతికత సాయంతో చలానాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. మరికొన్నిచోట్ల వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలు సీజ్ - Police Vehicle Checking At Tank Bund
రోజులు గడుస్తున్నా, కరోనా తీవ్రత పెరుగుతున్నా, ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలు పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. యథేచ్ఛగా, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
అనవసరంగా తిరిగితే వాహనాలు సీజ్