పశు వైద్యురాలు హత్యోదంతంలో పలువురు పోలీసులపై వేటు పడింది. ఘటన జరిగిన రోజు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన మృతురాలి కుటుంబసభ్యులతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మృతురాలి గురించి తప్పుగా మాట్లాడరన్న వార్తలతో... ఆ రోజు విధుల్లో ఉన్న శంషాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్, విమానాశ్రయ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు వేణు గోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు... - CRIME NEWS IN HYDERABAD
తమ అమ్మాయి కన్పించటంలేదంటూ పోలీస్‌స్టేషన్‌కు దీనంగా వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులను సూటిపోటి మాటలతో... పోలీసులు బాధించారు. వాళ్లు సకాలంలో స్పందించి ఉంటే కనీసం తమ కూతురి ప్రాణాలైనా కాపాడుకునేవారిమని బోరుమన్న రోదనలతో సదరు పోలీసులపై వేటు పడింది.
POLICE SUSPENDED IN SHAMSHABAD ISSUE