తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టుల కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు - మావోయిస్టుల కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు

మావోయిస్టుల కట్టడికి పోలీసులు త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో వారి కదలికలు పెరగడం సహా రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో.. ఆదిలోనే కట్టడి చేయాలనే ఉద్దేశంతో పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం పోలీసుల నిర్దిష్ట ప్రణాళికను వెల్లడిస్తోంది. ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులు డీజీపీ మకాం వేయడం... ములుగు జిల్లా వెంకటాపూర్‌లో కేంద్ర హోంశాఖ, సీఆర్పీఎఫ్‌, చత్తీస్‌గఢ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

మావోయిస్టుల కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు
మావోయిస్టుల కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు

By

Published : Oct 5, 2020, 4:09 AM IST

Updated : Oct 5, 2020, 7:01 AM IST

మావోయిస్టుల కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు

మావోయిస్టు కార్యకలాపాల కట్టడికి కీలకంగా పనిచేస్తున్న.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో-ఎస్​ఐబీ బలోపేతంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఇటీవలే అదనపు ఎస్పీ మురళీధర్‌.. బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలో పనిచేసిన అనుభవమున్న... అదనపు ఎస్పీ బల్ల రాజేశ్‌ను నియమించారు. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసి అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన దయానంద్‌రెడ్డి.. ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన అదనపు ఎస్పీ శ్రుతకీర్తిని నియమించారు. వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు... పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు వాట్సప్‌ ద్వారానే మాట్లాడుతున్నట్లు సమాచారం ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించేందుకే ఆ నియామకాలు చేపపట్టినట్లు తెలుస్తోంది.

మెరికల్లాంటి యువకులతో ప్రత్యేక బృందాలు

పోలీస్‌ శిక్షణాసంస్థ నుంచి ఈనెల7న... శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు బయటికి రానుండటంతో వారిలో మెరికల్లాంటి యువకులతో దాదాపు పది ప్రత్యేక బృందాల్ని తయారు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావితప్రాంతాల్లో వారిని ఏరియా డామినేషన్‌ పార్టీ-ఏడీపీలుగా వినియోగించనున్నట్లు తెలిసింది. గ్రేహౌండ్స్‌తో నిమిత్తం లేకుండా నిత్యం వారే అడవుల్లో కూంబింగ్‌ చేసేలా తీర్చిదిద్దినున్నట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెకంటేశ్‌ సహా మణుగూరు లోకల్‌ ఏరియా స్క్వాడ్‌ కమాండర్‌ సుధీర్‌ సంచరిస్తుండటంతో కూంబింగ్‌తో నియంత్రించొచ్చని భావిస్తున్నారు.

ప్రజాసంఘాల నేతలపై కేసులు

మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ప్రజాసంఘాల నేతలపై పోలీసులు గద్వాల, నల్లకుంట, చర్ల, గజ్వేల్‌, ఎల్‌బీనగర్‌....తదితర ప్రాంతాల్లో 8 కేసులు ఇప్పటికే నమోదు చేశారు. దాదాపు ఏడాది కింద గద్వాల కుట్ర కేసుతో మొదలైన కేసుల పరంపర ఇటీవలకాలం వరకు కొనసాగింది. ఐతే ఏ ఒక్క కేసులోనూ పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంతో నిందితులంతా... బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ తరుణంలో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయించడంపై ఎస్​ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు దృష్టి సారించారు.

ఇదీ చదవండి:సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలి: ఉత్తమ్

Last Updated : Oct 5, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details