ఈనెల 30 వరకు విధించిన లాక్డౌన్ను... మరోసారి పొడిగించకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో... పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వాళ్లను మాత్రమే తనిఖీ కేంద్రాల వద్ద అనుమతిస్తున్నారు. అత్యవసర పనిమీద వచ్చే వాళ్లను... సంబంధిత ధృవపత్రాలు చూపిస్తేనే వెళ్లనిస్తున్నారు. అకారణంగా బయటకు వచ్చే వాళ్లపై మాత్రం విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండోసారి కూడా వాహనాలు తీసుకొని అలాగే బయటకు వస్తే... వాళ్ల వాహనాలను తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు. ఆ తర్వాత వాహన యజమానిపై ఉన్న కేసును కోర్టులో ప్రవేశపెడుతున్నారు.
రోజుకు 2వేల వాహనాలు సీజ్
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 330 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి రోజు 2వేల వరకు వాహనాలను సీజ్ చేస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో దాదాపు 2లక్షల వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ప్యాకింగ్ యూనిట్లు, నిర్మాణ రంగం, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సంబంధిత రంగాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. వీళ్లకు ఎలాంటి ధృవపత్రాలు అవసరం లేకుండానే కేవలం గుర్తింపు కార్డును చూసి అనుమతిస్తున్నారు. మినహాయింపు రంగాలకు చెందిన వాళ్లు రహదారులపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అకారణంగా బయటకు వచ్చే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. గతేడాది విధించిన మొదటి లాక్డౌన్తో పోలీస్తే... రెండో లాక్డౌన్లో ప్రజల నుంచి సహకారం బాగానే ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు... తెలిసిన వాళ్లే మృతి చెందుతున్న వార్తలు తెలుసుకొని చాలామంది ప్రజలు అకారణంగా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.
తొమ్మిదిన్నరకే దుకాణాలు మూసేయాలని సూచన