తెలంగాణ

telangana

ETV Bharat / state

బేగంపేట వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు - MP Revanth Reddy latest news

ఎంపీ రేవంత్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కంటోన్మెంట్‌ ఆస్పత్రికి జనరేటర్‌ అందించే కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను.. బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద ఆపారు. తన వాహనాన్ని ఎందుకు ఆపుతున్నారో చెప్పాలంటూ ఎంపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

By

Published : May 16, 2021, 1:50 PM IST

హైదరాబాద్​ బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీగా నియోజకవర్గంలో తిరిగేందుకు వెళ్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పినా.. అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తన వాహనాన్ని ఆపిన ఇన్‌స్పెక్టర్‌తో రేవంత్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎందుకు తనను ఆపుతున్నారో చెప్పాలని.. రాతపూర్వక ఆదేశాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు.

ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

గాంధీ ఆస్పత్రి వద్దకు వెళ్లడానికి అనుమతి లేదని అక్కడ ఆంక్షలు ఉన్నాయని ఇన్‌స్పెక్టర్‌ స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌ ఆస్పత్రికి జనరేటర్‌ అందించే కార్యక్రమం ఉందని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన రేవంత్‌.. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేవంత్‌ వాహనం కదలకుండా పోలీసులు వలయంగా ఏర్పడ్డారు.

ఇదీ చూడండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ABOUT THE AUTHOR

...view details