తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముందస్తు ప్రణాళికతోనే 'బంగారం' చోరీ.. నిందితుల ఆధారాలు సేకరించాం..!' - Nagol Mahadev jewelry shop firing

Nagol Jewellery Shop Firing Case Update : హైదరాబాద్‌ నాగోల్​లోని స్నేహపురి కాలనీలో జరిగిన కాల్పులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 15 బృందాలుగా ఏర్పడి నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన రాచకొండ సీపీ.. స్థానికులా? ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠా ఈ చోరికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సీపీ మహేశ్‌భగవత్‌
సీపీ మహేశ్‌భగవత్‌

By

Published : Dec 2, 2022, 12:38 PM IST

Updated : Dec 2, 2022, 2:17 PM IST

Nagol Jewellery Shop Firing Case Update : నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ నగల దుకాణంలో చోరీ కేసులో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు కిలోల బంగారం, దాదాపు రూ.2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు ఇచ్చిన మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.

కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పరామర్శించారు. సుప్రజ ఆస్పత్రికి వెళ్లిన సీపీ.. వారికి జరుగుతున్న చికిత్సపై ఆరా తీశారు. కాల్పుల ఘటనపై వివరాలను బాధితులు కల్యాణ్ చౌదరి, సుఖ్​దేవ్‌లను అడిగి తెలుసుకున్నారు. పక్కా రెక్కీ నిర్వహించి నిందితులు దోపిడీ చేశారన్న సీపీ మహేశ్‌ భగవత్‌... నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. నిందితులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారని.. చోరీకి పాల్పడింది స్థానికులా లేక ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మహేష్ భగవత్

"నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో మహదేవ్ జ్యువెల్లరీ దుకాణంలో కాల్పులు జరిగాయి. దుకాణ యజమాని కల్యాణ్​తో పాటు సుఖ్​దేవ్ గాయపడ్డారు. సికింద్రాబాద్ లోని గణపతి జువెల్లర్స్ యజమాని రాజ్​కుమార్, సహాయకుడు సుఖ్​దేవ్ బంగారాన్ని హోల్​సేల్​గా విక్రయిస్తుంటారు. నిన్న కూడా మహదేవ్ నగల దుకాణంలో బంగారం విక్రయించేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు కాల్పులు జరిపి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు".- మహేశ్​ భగవత్, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 2, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details