తెలంగాణ

telangana

ETV Bharat / state

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసు.. దొరకని నిందితుల ఆచూకీ - tdp leader pattabhi latest news

ఆంధ్రప్రదేశ్​లో తెదేపా నేత పట్టాభిపై దాడి కేసు దర్యాప్తును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్నికోణాల్లోనూ విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ నిందితుల ఆచూకీ లభించలేదు. మరోవైపు పట్టాభి చికిత్స పొందుతున్న ఆస్పత్రితో పాటు..ఆయన ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసు.. దొరకని నిందితుల ఆచూకీ
తెదేపా నేత పట్టాభిపై దాడి కేసు.. దొరకని నిందితుల ఆచూకీ

By

Published : Feb 4, 2021, 7:18 PM IST

ఆంధ్రప్రదేశ్​లో సంచలనం రేపిన తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నగరంలో హైకోర్టు న్యాయమూర్తి, పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఘటన జరిగిన కాలనీలోనే నివాసం ఉంటున్నారు. ఇంతటి కీలకమైన ప్రాంతంలోనే దాడి జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలికి పక్కనే ఉన్న ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు నమోదు అవ్వగా....అస్పష్టంగా ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కొంత మెరుగుపరిచారు . దాదాపు పది మంది వరకు దాడిలో పాల్గొన్నారని.. వారిలో అధికులు 20 నుంచి 30 ఏళ్ల లోపు వారేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను గాలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాడి తర్వాత నిందితులు మూడు దిక్కులకు పారిపోయారని అంచనాకు వచ్చిన పోలీసులు... ఆయా మార్గాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించారు. ఫిర్యాదులో పట్టాభి కొందరు రౌడీ షీటర్ల పేర్లు చెప్పారు. వారితో పాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా ఆధారాలేవీ దొరకలేదు. దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

మరో వైపు పట్టాభికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా.. ? వ్యక్తిగత శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి వివాదాలు ఉన్నాయా? అన్న కోణాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం పట్టాభి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రితో పాటు ఆయన ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details