NARA LOKESH VEHICLE SEIZED : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
పాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్.. రోడ్డుపై బైఠాయింపు - పలమనేరులో యువగళం పాదయాత్ర
NARA LOKESH VEHICLE SEIZED : ఏపీలోని పలమనేరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. లోకేశ్ ఉపయోగించిన వాహనానికి మైక్ అనుమతి లేదని వాహనాన్ని సీజ్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ తెలిపారు.
పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. అందుకే సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రచార రథాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేశారని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పారు. లోకేశ్, టీడీపీ నేతల నిరసన తర్వాత పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టడంతో ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.
ఇవీ చదవండి: